: ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ రావణ కాష్ఠం చేసింది: మోడీ
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను రావణ కాష్ఠం చేసిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ విభజనపై అనుసరిస్తున్న విధానంతో తెలంగాణ, సీమాంధ్రలో అల్లర్లు రేపుతోందని విమర్శించారు. తల్లి పాలను కూడా కాంగ్రెస్ పార్టీ కల్తీని చేస్తుందని మోడీ ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎంతో దోచుకుందని ఆయన విమర్శించారు.