: వారెంట్ ఎఫెక్ట్.. రేపు గోవా పోలీసుల ముందుకు తేజ్ పాల్!
పలు మలుపులు తిరుగుతున్న 'తెహల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ రేపు గోవా పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫ్యాక్స్ పంపినట్లు తేజ్ పాల్ లాయర్ తెలిపారు. అంతకుముందు విచారణకు గడువు కావాలని కోరుతూ తేజ్ పాల్ ఓ లేఖ రాశారు. దానిని తిరస్కరించిన గోవా పోలీసులు వెంటనే నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు. మరోవైపు ఆయనను అరెస్టు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు తెహల్కాకు రాజీనామా చేసిన షోమా చౌదరి ఢిల్లీ నివాసం వద్ద ఉద్రిక్తత సృష్టించిన బీజేపీ నేత విజయ్ జాలీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.