: తేజ్ పాల్ అరెస్టుకు రంగం సిద్ధం
మహిళా పాత్రికేయురాలిపై లైంగిక వేధింపుల కేసులో తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని గోవా పోలీసులు తేజ్ పాల్ కు ఇచ్చిన సమయం మధ్యాహ్నంతో ముగిసింది. తనకు శనివారం వరకు వ్యవధి కావాలని తేజ్ పాల్ పెట్టుకున్న అభ్యర్థనను గోవా పోలీసులు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తేజ్ పాల్ ను గోవా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.