: భారతీయులంతా విమానాల్లో తిరగాలి: రాహుల్ గాంధీ


రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతిలో బీజేపీని మించింది లేదని ఆయన అన్నారు. వారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కానీ... ప్రజల కోసం ఏమీ చేయరని ఎద్దేవా చేశారు. మేమైతే ఆహారం, విద్య, ఉద్యోగాల గురించే మాట్లాడతామని... ఎందుకంటే మేము పేదలను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని అన్నారు. కేవలం ధనవంతులు మాత్రమే విమానాలు, మెరిసే కార్లలో తిరగాలని తాము భావించడం లేదని... భారతీయులందరూ వీటిలో తిరగాలనేదే తమ స్వప్నమని రాహుల్ తెలిపారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ ప్రజల కోసం ఎంతో చేశారని కొనియాడారు.

  • Loading...

More Telugu News