: హిందూ ధర్మం మీద కక్షతోనే కంచి పీఠాధిపతులపై కేసులు: పరిపూర్ణానంద


హిందూ ధర్మం మీద కక్షతోనే కంచి పీఠాధిపతులపై కేసులు నమోదు చేశారని పరిపూర్ణానంద స్వామి మండిపడ్డారు. కేసును దర్యాప్తు చేసిన అధికారి ప్రేమ్ కుమార్ స్వాములను రౌడీలను లాక్కెళ్లినట్టు లాక్కెళ్లారని, పీఠాధిపతులన్న గౌరవం చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఠాధిపతుల ఆరెస్టు గురించి అప్పటి సీఎం వైఎస్ ను అడిగితే తన చేతిలో ఏమీ లేదని తేల్చేశారని అన్నారు.

హిందూ మతాన్ని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, దేశంలోని నేతలు హిందూ మత ఉద్ధరణకు కార్యక్రమాలు చేపట్టడం లేదని తప్పుపట్టారు. బ్రిటీషర్లే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సంరక్షించారని, ఇప్పటి నేతలు అలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతికి వంద కిలోమీటర్ల పరిథిని హిందూ ధర్మక్షేత్రంగా డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇస్లాం విశ్వవిద్యాలయం ఎక్కడైనా కట్టుకోవచ్చని, కావాలని తిరుపతిలో కట్టడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News