: వ్యాట్ కు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారుల రిలే దీక్షలు


ఆంధ్రప్రదేశ్ వస్త్ర వ్యాపారులు నేటి నుంచి హైదరాబాదు ధర్నాచౌక్ లో రిలే దీక్షలు చేపడతున్నారు. వస్త్ర వ్యాపారంపై ప్రభుత్వం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) కొరడా ఝుళిపించిన నేపథ్యంలో వ్యాపారుల సంఘం శనివారం నుంచి రిలే దీక్షలకు పిలుపు నిచ్చింది.

ఏ రాష్ట్రాల్లో లేని వ్యాట్ ను కేవలం మన రాష్ట్రంలోనే విధించి తమను ఇబ్బంది పెట్టడం అన్యాయమని వ్యాపారులు వాపోతున్నారు. తమపై విధించిన వ్యాట్ ను ఎత్తివేసేలా  నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. 

  • Loading...

More Telugu News