: ఆరు దశాబ్దాలుగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది: నరేంద్ర మోడీ


భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం అనుసరించాల్సిన నియమాల విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో జరిగిన బీజేపీ ప్రచార ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. ఆరు దశాబ్దాలుగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని విమర్శించారు. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై కూడా మోడీ విమర్శలు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేద ప్రజలకు కొన్ని రాజ్యాంగ హక్కులు కల్పించారన్నారు. రాజ్యాంగ నియమాలను సక్రమంగా అమలు చేసినప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.

దేశంలో నదులను అనుసంధానం చేస్తే నీటిపారుదల రంగం అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. గోదాముల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోయాయని, వాటిని పేదలకు పంచాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కానీ, మద్యం కంపెనీలకు మాత్రం గోధుమలను కిలో 80 పైసలకే ప్రభుత్వం విక్రయిస్తోందని, పేదలకు మాత్రం పంచిపెట్టడం లేదన్నారు.

  • Loading...

More Telugu News