: 'తెహల్కా' తేజ్ పాల్ కేసులో సిబాల్ పేరును నేను ప్రస్తావించలేదు: సుష్మా


రోజు రోజుకీ తీవ్రమవుతున్న 'తెహల్కా' తేజ్ పాల్ కేసులో కేంద్రమంత్రి సిబాల్ పేరు బయటికి రావడం కేంద్రంలో కలకలం రేపుతోంది. తాజాగా దీనిపై బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. లైగింక వేధింపుల కేసులో తేజ్ పాల్ ను ఓ కేంద్రమంత్రి కాపాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఈ కేసులో సిబల్ పేరును తాను ప్రస్తావించలేదన్నారు. కానీ, ఈ కేసులో తనకే సంబంధం లేదని సిబాల్ ఖండించడం లేదన్నారామె. మరోవైపు సిబాల్ మాట్లాడుతూ.. ఆ మ్యాగజైన్ కు ఐదు లక్షల విరాళం ఇచ్చాను తప్ప, అందులో తనకేమి వాటాల్లేవని చెప్పారు.

  • Loading...

More Telugu News