: తెలంగాణకే ప్యాకేజీ ఇవ్వాలి: ఈటెల రాజేందర్
రాష్ట విభజన జరిగిన తర్వాత... ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో నష్టపోయిన తెలంగాణకే ప్యాకేజీ ఇవ్వాలని తెరాస నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం నెలకొన్న అన్ని సమస్యలకు తెలంగాణ ఏర్పాటే పరిష్కారమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యమకారులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణలో రాజకీయ నైపుణ్యం లేదని భావించరాదని సీమాంధ్ర నేతలను ఉద్దేశించి ఈటెల కామెంట్ చేశారు.