: కిరోసిన్ రవాణా చార్జీలను పెంచుతాం: మంత్రి ఆనం


త్వరలో కిరోసిన్ రవాణా ఛార్జీలు పెంచుతామని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రేషన్, కిరోసిన్ ల కమిషన్ పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయాన్ని సీఎంతో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ తయారీ యథాప్రకారం జరుగుతుందని... దానికి రాష్ట్ర విభజనతో సంబంధం లేదని అన్నారు. పామాయిల్ కోసం ప్రభుత్వం ఏటా రూ. 28 కోట్ల అదనపు భారాన్ని భరిస్తోందని తెలిపారు. పొత్తుల విషయాన్ని పార్టీ చూసుకుంటుందని ఆయన అన్నారు. ఈ రోజు మంత్రి రాంనారాయణరెడ్డి పౌరసరఫరాల శాఖలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News