: కాంగ్రెస్ భిక్ష వల్లే లగడపాటి ఎంపీ అయ్యారు: కొండ్రు మురళి


రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై మంత్రి కొండ్రు మురళీ మండిపడ్డారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న లగడపాటి రెండుసార్లు కాంగ్రెస్ భిక్ష వల్లే ఎంపీ అయ్యారన్నారు. ఈ విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలని సూచించారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న గంటా శ్రీనివాసరావు, లగడపాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వారు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

  • Loading...

More Telugu News