: ఆలపాడులో నేడు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. నేడు జరగనున్న టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అభ్యర్ధుల ఎంపికే కీలకాంశంగా ఈ సాయంత్రం జరగనున్న సమావేశంలో పలువురు పార్టీ నేతలు, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఆశావహులు పాల్గొననున్నారు.
ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు కృష్ణాజిల్లా కైకలూరు వద్ద పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దీంతో, అక్కడికి సమీపంలోని ఆలపాడు గ్రామంలో పోలిట్ బ్యూరో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికి మూడు స్థానాలు దక్కనుండగా వీటికోసం పలువురు అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు .
ఈ క్రమంలో అభ్యర్ధుల ఎంపిక కాసింత క్లిష్టంగానే మారింది. మరోవైపు ప్రజలపై సర్ ఛార్జీల బాదుడు, ఇతర ప్రజా సమస్యలపైనా అధినేతతో నేతలు చర్చిస్తారు.