: 49 మంది డీఎస్పీల బదిలీ
రాష్ట్రవ్యాప్తంగా 49 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న 18 మందికి సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్లుగా పోస్టింగులు ఇచ్చారు. హైదరాబాద్ లో కొందరు ఏసీపీలను ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అక్టోపస్ లో డీఎస్పీగా ఉన్న జె.భద్రేశ్వర్ ను శంషాబాద్ ఏసీపీగా నియమించారు. ఏపీఎస్పీలో ఉన్న అశోక్ కుమార్ ను బంజారాహిల్స్ ఏసీపీగా, ఇంటిలిజెన్స్ లో ఉన్న ఇస్మాయిల్ ను సైఫాబాద్ కు, సైబర్ క్రైమ్ డీఎస్పీగా ఉన్న చిట్టిబాబును గోషామహల్ ఏసీపీగా నియమించారు. అనంతపురం, విజయవాడ వెస్ట్, బెల్లంపల్లి, హన్మకొండ, పెనుగొండ, నరసరావుపేట, అమలాపురం, వనపర్తి, నిర్మల్ డీఎస్పీలను ఇంటిలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు.