: యువత ఉపాధికి వృత్తి విద్యా కోర్సులు: కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి


హైదరాబాద్ లో 7వ జాతీయ నైపుణ్య సదస్సును కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి కె. సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2020 నాటికి దేశంలో 50 కోట్ల మంది నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సురేష్ చెప్పారు. ఈతరం యువత పట్టభద్రులవుతున్నా వారిలో సరైన నైపుణ్యాలు కొరవడుతున్నాయని... వారిలో నైపుణ్యాలు పెంచేందుకు, అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఫ్రపంచ స్థాయి మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువతకు ఉపాధి ఆధారిత కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర మంత్రి సురేష్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News