: చూస్తూ ఊరుకునే దద్దమ్మలం కాదు: దానం నాగేందర్
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మలం కాదని మంత్రి దానం నాగేందర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు కొందరు తమ స్వార్థం కోసం హైదరాబాద్ ను యూటీ చేయమంటున్నారని మండిపడ్డారు. తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళితే ఏం చేయాలో తమకు తెలుసని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. యూటీ అయితే అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయని, అప్పుడు ప్రజా ప్రతినిధులుగా తాము ఏం చేయాలని నిలదీశారు. అధికారాలు కేంద్రం చేతిలో ఉండడం తమకు సమ్మతం కాదని స్పష్టం చేశారు.