: బ్రిటన్ లో నాలుగింతలు పెరిగిన లెస్బియన్లు


లోకం వింత పోకడలు పోతోంది. పురుషులతో మహిళలకు, మహిళలతో పురుషులకి భవిష్యత్ లో అవసరం ఉండే అవకాశాలు తగ్గిపోతున్నాయి. తాజాగా బ్రిటన్ లో మహిళా స్వలింగ సంపర్కుల సంఖ్య దశాబ్ద కాలంలో నాలుగింతలు పెరిగినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గే సంఖ్యలో పెద్దగా మార్పు లేనప్పటికీ మహిళా సంపర్కుల సంఖ్యలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని లైంగిక ప్రవర్తన, జీవన శైలిపై జరిపిన జాతీయ సర్వేలో వెల్లడైంది.

శృంగారం విషయంలో మహిళలు సాహసోపేతంగా వ్యవహరిస్తున్నారని, ప్రయోగాలకు వెనుకాడడం లేదని సర్వే తెలిపింది. లైంగిక విజ్ఞానంపై వారికి అవగాహన ఎక్కువగానే ఉందని కూడా వెల్లడించింది. 1990లో లెస్బియన్లు 4 శాతం మంది ఉండగా 2010 నాటికి వీరి సంఖ్య 16 శాతానికి చేరుకుందని తెలిపింది. వీరిలో ఎక్కువ మంది తమ భాగస్వాములతోనే లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నట్టు సర్వే తెలిపింది. పురుష సంపర్కుల సంఖ్య ఒక శాతం పెరిగిందని సదరు సర్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News