: వాదనలు వినిపించడంతో ప్రభుత్వం విఫలమైంది: దేవినేని ఉమ
మిగులు జలాలు కోరబోమంటూ వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన లేఖ రాష్ట్రానికి ఉరితాడులా మారిందని టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఆల్మట్టి ఎత్తు మరో 19 అడుగులు పెంచితే కృష్ణా డెల్టా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందని అన్నారు. కృష్ణా డెల్టాలో నారుమళ్లకు జూన్ లో రావాల్సిన నీరు నవంబర్ వరకు రాదన్న దేవినేని ఉమ, రాజేష్ ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.