: మధురమైన మద్యం వచ్చేస్తోంది


అట్లాంటి ఇట్లాంటి మద్యం కాదు బాబూ.. తేనెతో చేసింది. మధురమైనది. రుగ్వేదంలో చెప్పినది. తన జన్మస్థలం భారత్ కు మళ్లీ వచ్చేస్తోంది. తేనెతో తయారు చేసే ఈ మద్యం ఫార్ములాపై యూరోప్ లోని లిథూనియా దేశానికి చెందిన ఒక కంపెనీకి పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీ భారత్ లో మధుమద్యాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రపంచంలో తొలి తేనె తయారీ మద్యం ఇదే. తేనె, నీరు, ఈస్ట్, మూలికలు, కూరగాయలతో దీన్ని తయారు చేస్తారు. డిసెంబర్ 10 నుంచి ఢిల్లీలో జరిగే ఫుడ్ ఎగ్జిబిషన్ లో దీన్ని ప్రదర్శించబోతున్నారు. 2014లో ఈ ఆల్కహాల్ దేశీయ మార్కెట్లోకి వస్తుందని ఇండియన్ బాల్టిక్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News