: మా చుట్టూ తిరుగుతూ సీమాంధ్ర నేతలు టైంవేస్టు చేసుకోవద్దు: జీవోఎం వర్గాలు


హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు తథ్యమని జీవోఎం స్పష్టం చేసింది. పరిమిత ఆంక్షలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. హైదరాబాద్, భద్రాచలంపై ఏ విధమైన సమస్యలు లేవన్న జీవోఎం వర్గాలు, సీమాంధ్ర నేతలు తమ చుట్టూ తిరుగుతూ సమయం వృధా చేసుకోవద్దని హితవు పలికాయి. వీలైనంత తొందర్లో కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు వస్తుందని, శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెడతామని జీవోఎం వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఆఖరి నిమిషంలో మార్పులు ఉంటే ఉండొచ్చని జీవోఎం వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News