: ఢిల్లీలో సమావేశమైన సీఎం, బొత్స
ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఈ ఉదయం అక్కడి ఏపీ భవన్ లో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారుపై హస్తినలో ఇద్దరూ అధిష్టానంతో తీవ్ర మంతనాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం వీరిద్దరే సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరికాసేపట్లో వీరిద్దరూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాంనబీ ఆజాద్ తో భేటీ అవనున్నారు. ఆ తర్వాత అధినేత్రి సోనియాగాంధీతోనూ చివరిసారి చర్చించి, ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నారని పార్టీ వర్గాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

- Loading...
More Telugu News
- Loading...