: కాసేపట్లో జీవోఎంతో భేటీకానున్న దామోదర
కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్న ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాసేపట్లో జీవోఎంతో భేటీ కానున్నారు. హైదరాబాద్ పై పరిమిత ఆంక్షలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సిద్దమవుతున్నందున డిప్యూటీ సీఎం అభిప్రాయం తెలుసుకునేందుకు ఢిల్లీ పిలిపించినట్టు సమాచారం. జీవోఎంతో భేటీలో హైదరాబాద్ పై పరిమిత ఆంక్షల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహం, ప్యాకేజీ వంటి అంశాలపై ఓ నివేదికను రాజనర్సింహ జీవోఎంకు సమర్పించనున్నారు. ముందుగా కేంద్ర హోం మంత్రి షిండేతో భేటీ అనంతరం జీవోఎంతో సమావేశం కానున్నట్టు సమాచారం.