: తప్పిన పెను ముప్పు.. తీవ్ర వాయుగుండంగా మారిన లెహర్


బంగాళాఖాతంలో పెనుతుపానుగా మారి రాష్ట్ర ప్రజలను వణికించిన లెహర్ బలహీనపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో అధికారులు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర వాయుగుండం మచిలీ పట్నానికి ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మచిలీపట్నం వద్ద మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనివల్ల కోస్తాంధ్ర, తెలంగాణలో రాగల 24 గంటల్లో పలు చోట్ల వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ వేగం నిన్న 150 కిలోమీటర్లు ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News