: అధిష్ఠానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం
కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో రాష్ట్ర డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. విభజన నివేదిక ముసాయిదా పూర్తవుతున్న తరుణంలో ఆయనకు పిలుపు రావడం గమనార్హం. ఢిల్లీలో ఆయన జీవోఎంతో భేటీ కానున్నారు. జీవోఎం రూపొందించిన తుది నివేదికపై అభిప్రాయాలను తీసుకునేందుకునే డిప్యూటీ సీఎంను ఢిల్లీకి పిలిచినట్టు సమాచారం. అంతేకాకుండా, ఢిల్లీలో ఆయన పలువురు కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు.