: ఎక్కువసేపు టీవీ చూస్తున్నారా...
ఎక్కువసేపు టీవీ చూసేవారికి పలు రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ పిల్లలు కూడా ఎక్కువ చూస్తున్నారా... అయితే జాగ్రత్త చిన్న వయసులోనే వారి మెదడు ఎదుగుదల, పనితీరు దెబ్బతింటుందట. ఈ విషయాన్ని పరిశోధకులు తాజా అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. ఇళ్లలో పిల్లల బెడ్రూముల్లో ఎక్కువమంది టీవీలను ఏర్పాటు చేస్తుంటారు. దీంతో ఎక్కువసేపు పిల్లలు టీవీ చూడడంతోనే గడుపుతుంటారు. ఇలా ఎక్కువసేపు టీవీ చూడడం వల్ల పిల్లల మెదడు పనితీరు దెబ్బతింటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
చిన్న పిల్లలు ఎక్కువసేపు టీవీ చూడడం వల్ల మెదడు పనితీరు దెబ్బతినడమే కాకుండా మానసికంగా ఎదుగుదల కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని ఇటీవల పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. ఇది వారి ప్రవర్తనా శైలిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఇలా ఎక్కువసేపు టీవీ చూసే పిల్లలు వివిధ సందర్భాలకు స్పందించే తీరు విభిన్నంగా ఉంటుందని, వీరి ఇష్టాఇష్టాలు, నమ్మకాలు, కోరికలు కూడా ఇతర పిల్లలకు భిన్నంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి పిల్లలు టీవీ చూస్తుంటే ఒక పరిధికి మించకుండా చూసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవుకదా.