: త్వరలో 6 నగరాల్లో ఆర్టీసీ సిటీ బస్సులు
రాష్ట్రంలోని 6 నగరాల్లో ఈ ఏడాది సిటీ బస్సులను ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ వెల్లడించారు. వీటిలో అనంతపురం, కడప, చిత్తూరు, ఖమ్మం, మహబూబ్ నగర్ లలో 230 సిటీ బస్సులను ప్రారంభించనున్నట్లు ఖాన్ తెలిపారు. పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటన తరువాత రాష్ట్రంలోని 300 బస్సుల్లో అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై అధ్యయనం కొనసాగుతోందని ఏకే ఖాన్ చెప్పారు.