: ఢిల్లీ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం
రాజధాని నగరం ఢిల్లీ శీతాకాలంలో వర్షాకాలాన్ని మైమరపించింది. ఈ రోజు తెల్లవారుఝాము నుంచీ దేశ రాజధానిలో భారీ వర్షం కురుస్తోంది. పర్యవసానంగా పలు ప్రాంతాలలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీనికి శీతాకాలం చలి తోడవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ రోజు కూడా నగరంలో వర్షం పడే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అకాల వర్షంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.