: క్యాడ్ బరీ కంపెనీకి శంకుస్థాపన చేసిన సీఎం


దేశంలో అత్యధిక పెట్టుబడులు వస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రముఖ చాక్లెట్ కంపెనీ క్యాడ్ బరీతో ప్రభుత్వం ఈ రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో క్యాడ్ బరీ పరిశ్రమకు సీఎం కిరణ్ శంకుస్థాపన చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రస్తుతం రాష్ట్రంలో అనువైన వాతావరణం ఉందని, అందుకే పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని సీఎం కిరణ్ చెప్పారు. ఈ పరిశ్రమ ద్వారా 6 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు లబ్ది చేకూరనుందని కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్యాడ్ బరీ రాకతో మరిన్ని అంతర్జాతీయ కంపెనీల ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని సీఎం కిరణ్ అన్నారు. 2015 మధ్యంతరానికి సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడితో మొదటి దశ పనులను పూర్తి చేసి, ఉత్పత్తి ప్రారంభిస్తుందని క్యాడ్ బరీ ఇండియా ఎండీ మనూ ఆనంద్ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 16 వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మనూ ఆనంద్ చెప్పారు.

  • Loading...

More Telugu News