: రెండు గంటలకు పైగా కొనసాగుతున్న జీవోఎం భేటీ
ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో హోంమంత్రి కార్యాలయంలో రెండు గంటలకు పైగా జీవోఎం భేటీ కొనసాగుతోంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో హోంమంత్రిత్వశాఖ, ఆర్థిక, నీటి పంపిణీ అధికారులతో జీవోఎం సభ్యుల చర్చలు పూర్తయ్యాయి. అనంతరం జీవోఎం సభ్యులు పలు విషయాలపై చర్చించుకుంటున్నారు.