: ఆరుషి తల్లిదండ్రులు జైలులో ఏం చేస్తున్నారు?


ఆరుషి, హేమ్ రాజ్ జంట హత్య కేసులో వైద్య దంపతులు రాజేష్, నుపుర్ తల్వార్ లకు ఘజియాబాద్ సీబీఐ కోర్టు జీవితకాల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే పోలీసులు వారిని దస్నా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో రాజేష్ తల్వార్ జైలు ఆస్పత్రిలో పనిచేస్తారని, నుపుర్ తల్వార్ ఇతర మహిళా ఖైదీలకు, పిల్లలకు పాఠాలు చెబుతారని జైలు అధికారులు తెలిపారు. దీని ద్వారా ఇరువురూ ప్రతిరోజు నలభై రూపాయలు సంపాదిస్తారని వెల్లడించారు. ఇక తీర్పు వెల్లడించిన రోజు రాత్రి తల్వార్ లు పుస్తకాలు చదువుతూ గడిపారని, త్వరలో వారికి సైకలాజికల్ థెరపీ ఇప్పిస్తామని జైల్ సూపరింటెండెంట్ విరేశ్ రాజ్ శర్మ చెప్పారు. మరోవైపు సీబీఐ కోర్టు తీర్పును కొద్ది రోజుల్లో పైకోర్టులో సవాల్ చేయనున్నట్లు తల్వార్ దంపతుల లాయర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News