: రెండు పొగాకు వంగడాల సృష్టి
పొగాకులో అధిక దిగుబడులతో పాటు నాణ్యతతో కూడిన రెండు కొత్త వంగడాలను రూపొందించినట్లు రాజమండ్రిలోని కేంద్ర పొగాకు రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని కోట నాగవరం గ్రామాన్ని పరిశోధకులు సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధకులు నాగేశ్వరరావు, సుబ్బయ్య, సరళ, అరుణ కుమారిలు మీడియాతో మాట్లాడారు. సాధారణంగా రైతులు కాంచన రకం విత్తనంతో పొగాకును సాగుచేస్తున్నారన్నారు. మరిన్ని మెరుగైన ఫలితాలను ఇచ్చే విధంగా ఎన్.ఎల్.ఎస్.టి-4, టొబియోన్ వంగడాలను రూపొందించామని తెలిపారు. వీటిని పరిశీలించేందుకు కోట నాగవరం గ్రామంలో సాగు చేస్తున్నామని వారు వెల్లడించారు.