: మారుతీ కార్ల రీ కాల్
2013 అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 26 వరకు మారుతి సంస్ధ ఉత్పత్తి చేసిన ఎర్టిగా, స్విఫ్ట్, డిజైర్, ఏ-స్టార్ మోడల్స్ కు చెందిన 1492 కార్లను రీకాల్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. 1492 వాహనాల స్టీరింగ్ కాలమ్స్ లో తలెత్తిన సమస్యలను కంపెనీ తరఫున సరిదిద్దుతామని... అందుకే కొత్తగా తయారు చేసిన స్టీరింగ్ కాలమ్స్ ను డీలర్ వర్క్ షాపులకు పంపించామని మారుతి తెలిపింది. సమస్య తలెత్తిన వినియోగదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. ఈ సదుపాయాన్ని ఉచితంగా పొందవచ్చని మారుతి సంస్థ తెలిపింది. గతంలో కూడా ఏ స్టార్ కారులో ఫ్యూయల్ పంపులో సమస్య తలెత్తినప్పుడు కూడా ఇలానే రీకాల్ చేసింది.