: తెలంగాణ రావడం కేసీఆర్ కు ఇష్టం లేదు: మోత్కుపల్లి
2014 వరకు తెలంగాణ రావడం కేసీఆర్ కు ఇష్టం లేదని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. హైదరాబాదును యూటీ చేస్తారనే వాదన వినబడుతోందని, శాశ్వత యూటీ చేయకుండా చూడాల్సిన అవసరం కేసీఆర్ కు లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో ఢిల్లీలో ఉండకుండా ఫాంహౌస్ లో కేసీఆర్ కు ఏం పనని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిలిదీశారు.