: నాలుగు నెలలు ఓపిక పట్టండి.. ప్రభుత్వం మనదే: జగన్
నాలుగు నెలలు ఓపిక పడితే వచ్చేది తమ ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తుపాను బాధితులను పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తుపానుల ధాటికి వ్యవసాయదారులే తీవ్రంగా నష్టపోయారని, అందుకే రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి ప్రభుత్వం స్పందించినా, స్పందించకున్నా వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అండగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు.