: ఉమ్మడి రాజధానికి కాలపరిమితి ఉండాలి: సర్వే సత్యనారాయణ
హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేస్తే, దానికంటూ ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. తెలంగాణను ప్రకటించిన తర్వాత అన్ని అధికారాలను లాక్కుంటామంటే అంగీకరించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని సర్వే అన్నారు. అలాగే తెలంగాణ వస్తే సీమాంధ్రులను పంపించివేస్తారని ఆందోళన పడుతున్నారని, వారి భయాలను తొలగించాల్సిన అవసరం ఉందని సర్వే సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.