: నార్త్ బ్లాక్ లో జీవోఎం భేటీ ప్రారంభం


ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని హోంమంత్రి కార్యాలయంలో జీవోఎం భేటీ ప్రారంభమైంది. జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేశ్, చిదంబరం, వీరప్ప మొయిలీ, ఏకే ఆంటోనీ, నారాయణ స్వామి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈసారి సమావేశానికి గులాంనబీ ఆజాద్ గైర్హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు తెలంగాణ బిల్లు ముసాయిదాపై సభ్యులు చర్చించిన సంగతి తెలిసిందే. అయితే, నేటిదే చివరి సమావేశమని ఢిల్లీ వర్గాలు అంటుండగా, మరోసారి భేటీ ఉంటుందని సమాచారం. ఏదేమైనా ఈ నెలఖరుకు బిల్లుపై పూర్తిస్థాయి చర్చలు చేసి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలని అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News