: పాకిస్థాన్ ఆర్మీకి కొత్త చీఫ్
పాకిస్థాన్ ఆర్మీ కొత్త చీఫ్ గా రహీల్ షరీఫ్ నియమితులయ్యారు. పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్న రహీల్ ను ఈ పదవికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అష్ఫక్ పర్వేజ్ కయానీ పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది.