: భద్రాచలాన్ని విభజిస్తే తడాఖా చూపిస్తా: రేణుకా చౌదరి


భద్రాచలం తెలంగాణలోనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలాన్ని విడదీస్తే తన తడాఖా చూపిస్తానని హెచ్చరించారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ తెలంగాణ వ్యతిరేకి కాదని ఆమె స్పష్టం చేశారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని... ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరముందని, అందుకే కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవీ బాధ్యతలు నిర్వహించలేనని పార్టీ అధిష్ఠానానికి తెలిపానని అన్నారు. అందువల్లే పదవీబాధ్యతల నుంచి పార్టీ తప్పించిందని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News