: కన్న కూతురుపైనే అత్యాచారం చేసిన కామాంధుడు
సికింద్రాబాద్ బొల్లారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కన్ను మిన్నూ కానక కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన తండ్రిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా... నిత్యం ఆడపిల్లలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.