: అవిశ్వాసం పెట్టండి.. చూసుకుంటాం: మంత్రి ఆనం ధీమా
ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకుందని ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎవరైన అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడితే సభలో బలాబలాలు రుజువు చేసుకుంటామని ఆనం తెలిపారు.
కాగా, ప్రస్తుతం ప్రభుత్వం మంచి నీటి ఎద్దడి, విద్యుత్ సమస్యలపై దృష్టి సారించిందని, త్వరలోనే వాటిని అధిగమిస్తామని ఆయన చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ చివరి వారంలోగానీ, మే మొదటి వారంలోగానీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆనం వెల్లడించారు.