: విద్యార్థులు మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలి: అశోక్ బాబు
రాష్ట్ర విభజనపై వస్తున్న పుకార్లు కల్లిబొల్లి మాటలేనని, ఇంకా ఏమీ కాలేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. నెల్లూరులో సింహపురి కళాశాల విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ, మరోసారి ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన జరగడానికి వీల్లేదని డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు పెట్టిన తరువాత తమ సత్తా చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈసారి శాంతియుత ఉద్యమంతో పాటు జాతీయ రహదారులు, విద్యుత్, రైల్వే సౌకర్యాలను నిషేధిస్తామని వెల్లడించారు.