: శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: దిగ్విజయ్


పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆయన ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రుల బృందం సమర్పించే నివేదిక కూడా త్వరలోనే కేబినెట్ ముందుకు వస్తుందని తెలిపారు. రాష్ట్ర విభజనపై అన్ని అంశాలను జీవోఎం పరిశీలిస్తుందని దిగ్విజయ్ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కాంగ్రెస్ విధేయుడేనని, పార్టీ నిర్ణయాలను కిరణ్ గౌరవిస్తానన్నారని అన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసే వెసులుబాటు రాజ్యాంగంలో ఉందని దిగ్విజయ్ చెప్పారు.

  • Loading...

More Telugu News