: హైదరాబాద్ ను యూటీ చేయాలని ప్రతిపాదించాం: చిరంజీవి


అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకునే విభజనపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి చిదరంబరంతో భేటీ అనంతరం ఆయన ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ను యూటీ చేయాలనే తాము గట్టిగా ప్రతిపాదించామని అన్నారు. రాష్ట్రాన్ని విభజించే పక్షంలో ఎక్కువ మంది హైదరాబాద్ ను యూటీ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్ తో రాష్ట్ర ప్రజలందరి మనోభావాలు ముడిపడి ఉన్నాయని, అలాగే విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, రెవెన్యూ కూడా హైదరాబాద్ దే ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ ను యూటీ చేసి, భద్రాచలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ఆయన సూచించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News