: న్యాయవాదులు, పోలీసుల మధ్య జగడం
తెలుగుతల్లి కాంస్య విగ్రహం న్యాయవాదులకు, పోలీసులకు మధ్య జగడాన్ని సృష్టించింది. విశాఖపట్టణం మద్దిలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుతల్లి కాంస్య విగ్రహాన్ని ప్రారంభించేందుకు ప్రదర్శనగా వచ్చిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల వైఖరికి నిరసనగా మద్దిలపాలెం కూడలిలో న్యాయవాదులు ధర్నా, మానవహారం నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.