: కేజ్రీవాల్, నలుగురు ఏఏపీ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ)పై ఢిల్లీ కాంగ్రెస్ కత్తి కట్టినట్లుగా ఉంది. ఇప్పటికే పార్టీ విరాళాల వ్యవహారం వివాదం కావడంతో ఏఏపీ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మరో నలుగురు పార్టీ అభ్యర్థులపై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కార్యదర్శి పవన్ ఖేరీ క్రిమినల్ కేసులు పెట్టారు. అందులో కేజ్రీవాల్ పై ఐదు నేరారోపణలు చేశారు. అంతేకాక, పరువునష్టం దావా కూడా వేశారు. ఫిర్యాదులో... అల్లర్లు, అసెంబ్లీ ఎదుట నిరసనలు, బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రజలను అడ్డుకోవడంలాంటి ఆరోపణలు చేశారు.