: శీతాకాల సమావేశాల్లో బిల్లు రాదు: లగడపాటి


ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర విభజన బిల్లు వచ్చే అవకాశమే లేదని విజయవాడ ఎంపీ లగడపాటి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అంత సులువు కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అత్యధిక ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. విభజన అనివార్యం అన్న భావనను అందరూ పక్కన పెడితే మంచిదని తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, లగడపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరుప్రాంతాల సమస్యలను పరిష్కరించడం అంత సులువు కాదని... అందువల్ల రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని అన్నారు. అంతేకాక, యూటీపై ఏకాభిప్రాయం సాధించడం కూడా అసంభవమని.. కాబట్టి హైదరాబాద్ ను యూటీ చేయడం కూడా కుదరదని అన్నారు. యూటీకి అనేక అడ్డంకులున్నాయన్నది తనదగ్గరున్న సమాచారమని తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో జరగనున్న జీవోఎం సమావేశంలో ఏమీ తేలదని లగడపాటి జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News