: 'నిర్భయ' కేసులో ఫోరెన్సిక్ నిపుణుల సాక్ష్యం నమోదు
కామపిశాచుల కదనకేళికి నిలువునా బలైపోయిన 'నిర్భయ' అత్యాచారం కేసులో ఫోరెన్సిక్ నిపుణుల సాక్ష్యాన్ని నమోదు చేశారు. ఈమేరకు ఫోరెన్సిక్ అధికారులు ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎదుట హాజరయ్యారు. అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా వారు చెప్పిన వివరాలను రికార్డు చేశారు. ఢిల్లీ పోలీసులు అందజేసిన సాక్ష్యాధారాలను ఈ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు.