: హత్య కేసులో కంచి స్వాములను నిర్దోషులుగా తేల్చిన కోర్టు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరదరాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్ రామన్ హత్య కేసులో కంచి స్వాములకు ఊరట లభించింది. శంకర్ రామన్ హత్య కేసులో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, ఆయన శిష్యుడు విజయేంద్ర సరస్వతిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ పాండిచ్చేరి జిల్లా సెషన్స్ కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. వీరితో పాటు మొత్తం 23 మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. నిందితుల ప్రమేయంపై దర్యాప్తు బృందం సరైన ఆధారాలను చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. హత్యచేసిన వారిని హతుడి భార్య కూడా గుర్తుపట్టలేకపోయారని కోర్టు తెలిపింది. ఈ కేసులో మొత్తం 189 మంది సాక్షులను కోర్టు విచారించింది. దీంతో నిందితులే హత్య చేశారని నిర్ణయించలేమని కోర్టు తెలిపింది.