: కూడంకుళం అణు ప్లాంట్ సమీపంలో పేలుళ్లు.. ఆరుగురు మృతి
తమిళనాడులోని, తిరునెల్వేలిలో కూడంకుళం అణువిద్యుత్ కర్మాగారం సమీపంలో రాత్రి పేలుళ్లు జరిగాయి. సునామీ కాలనీలోని ఒక ఇంట్లో జరిగిన పేలుళ్లలో ముగ్గురు బాలికలు సహా ఆరుగురు మృతి చెందారు. గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణే పేలుళ్లకు దారి తీసిందని సమాచారం. పోలీసులు కాలనీకి వచ్చేసరికే గ్రామస్థులు అందరూ అక్కడి నుంచి పారిపోవడం విశేషం. పేలుళ్లు జరిగిన ఇంటి నుంచి నాలుగు మృత దేహాలను స్వాధీనం చేసుకోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కన్నుమూశారు.