: జైరాం రమేష్ తో ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ


జైరాం రమేష్ తో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ ముగిసింది. సమావేశం అనంతరం సీమాంధ్ర కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ను యూటీ చేయాలని జైరాంను కోరినట్టు తెలిపారు. సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పాటుకోసం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కోరామని అన్నారు. కొత్త రాజధానికి అవసరమైన భూమి, నీటికోసం కమిటీ పనిచేసేలా చూడాలని చెప్పామని తెలిపారు. సీమాంధ్రలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అడిగామని అన్నారు. జైరాం రమేష్ స్పందిస్తూ, సీమాంధ్ర ప్రాంత సమస్యలను సీరియస్ గా పరిగణిస్తున్నామని చెప్పినట్టు తెలిపారు. ఈ భేటీలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, పనబాక, కిళ్లి కృపారాణి, కోట్ల, జేడీ శీలం పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News