: ఇలాంటివాటిని పిల్లలకు దూరంగా ఉంచితేనే మంచిది


కొందరు తమ పిల్లలు ఏవి అడిగితే వాటిని వెంటనే వారికి అందించాలని అనుకుంటారు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వీడియో గేములు. పిల్లలు అడిగారు కదా అని వారు కోరిన గేములన్నింటినీ వారికి అందుబాటులో ఉండేలా చేయాలని కొందరు తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. ఇది మంచి అలవాటు కాదని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల హింసాత్మక వీడియో గేములను ఆడే పిల్లలు ఇతరులతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటారని, కాబట్టి ఇలాంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచితే మేలని హెచ్చరిస్తున్నారు.

ఓహియో స్టేట్‌ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ బ్రాడ్‌ బుష్‌మేన్‌ నేతృత్వంలో శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో హింసాత్మక వీడియో గేములను ఆడే టీనేజర్ల మనస్తత్వం ఇతర పిల్లలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని తేలింది. మొత్తం 172 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలను పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి వీడియో గేములను ఆడేవారికి తిండి విషయంలో నియంత్రణ ఉండదని బుష్‌మేన్‌ చెబుతున్నారు. ఇలాంటి పిల్లలు దూకుడు స్వభావంతోబాటు మోసపూరిత ధోరణిని కలిగివుంటారని తమ అధ్యయనంలో గుర్తించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు నైతిక విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని వీరు కొన్నిసార్లు భావిస్తారని ఈ అధ్యయనంలో తేలిందట. కాబట్టి పిల్లలు అడిగారు కదా అని వారు అడిగినవన్నీ కొనేయకుండా, వారిపై ఒక కన్నేసి ఉంచండి. వారు ఆడే ఆటలు ఎలాంటివో కూడా అప్పుడప్పుడూ గమనిస్తూవుంటే పిల్లలు అదుపుతప్పడం కొంతైనా తగ్గుతుంది.

  • Loading...

More Telugu News